'ఆర్ఆర్ఆర్' ప్రెస్ మీట్... మా ఆయన బయలుదేరాడు: ఉపాసన

  • ఉదయం 11.30 గంటలకు ప్రెస్ మీట్
  • పాల్గొనేందుకు వెళ్లిన రామ్ చరణ్
  • ట్విట్టర్ లో ఫోటో పెట్టిన ఉపాసన
దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నిర్మితమవుతున్న మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్' (వర్కింగ్ టైటిల్)పై ఇంతవరకూ ఏ విధమైన వివరాలూ బయటకు వెల్లడి కాలేదన్న సంగతి తెలిసిందే. ఇక సినిమా విశేషాలను, మరికొన్ని అంశాలను ప్రేక్షకులకు చెప్పేందుకు రాజమౌళి ఈ ఉదయం 11.30 గంటల ప్రాంతంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వెళ్లేందుకు రామ్ చరణ్ ఇంట్లో నుంచి బయటకు వస్తున్న వేళ, వెనుకనుంచి ఫోటో తీసిన ఉపాసన, దాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. గుడ్ లక్ టీమ్ అంటూ అభినందనలు తెలిపారు.  



Go Back to Shorts
Ramcharan
NTR
Rajamouli
RRR
Upasana
Twitter

More Telugu News